‘కాక్రోచ్’లకు మద్దతు ఇవ్వొద్దు.. పోస్టులు పెట్టొద్దు
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:39 AM
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న వేళ.. ఐఐటీ రూర్కీ తన విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి జారీచేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పమయ్యాయి...
విద్యార్థులు, సిబ్బందికి ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం
న్యూఢిల్లీ, జూలై 21: దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న వేళ.. ఐఐటీ రూర్కీ తన విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి జారీచేసిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పమయ్యాయి. ‘ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలాంటి రాజకీయ ఉద్యమాల’కు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలపడం చేయొద్దని ఐఐటీ రూర్కీ హెచ్చరించింది. విద్యాసంస్థ, ప్రభుత్వం మధ్య సంబంధాలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేలా ఏ విద్యార్థి లేదా ఉద్యోగి కూడా ప్రకటనలు చేయడం నిషేధమని, సంస్థ అనుమతి లేకుండా రాజకీయ చర్చల్లో చేరడం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం చేయకూడదని పేర్కొంది. ఈ అడ్వైజరీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ అడ్వైజరీ ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి జారీచేసే అంతర్గత సలహా మాత్రమేనని ఐఐటీ రూర్కీ పేర్కొంది. అది ఎలాంటి కొత్త ఆదేశం లేదా విధానం కాదని స్పష్టం చేసింది. ఆ సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఉన్నత విద్యా సంస్థ అధికార ప్రతినిధి ఒకరు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!