Share News

నేను క్యాన్సర్‌ నుంచి కోలుకున్నా నెతన్యాహు

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:41 AM

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాను ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వ్యాధి నుంచి పూర్తిగా...

నేను క్యాన్సర్‌ నుంచి కోలుకున్నా నెతన్యాహు

జెరూసలేం, ఏప్రిల్‌ 24: ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాను ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నానని నెతన్యాహు శుక్రవారం స్వయంగా ప్రకటించారు. తన వార్షిక వైద్య పరీక్షల నివేదికలలో ఈ వివరాలను వెల్లడించారు.వాస్తవానికి ఈ సమాచారాన్ని రెండు నెలల క్రితమే వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా చెప్పలేదని పేర్కొన్నారు. దీనిని శత్రు దేశాలు తప్పుడు ప్రచారానికి వాడుకోకూడదన్న ఉద్దేశంతోనే ఆలస్యంగా వెల్లడించినట్లు ఆయన స్పష్టం చేశారు. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో నెతన్యాహుకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. క్యాన్సర్‌ కణతిని తొలగించేందుకు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన శరీరంలో క్యాన్సర్‌ కణాలు లేవని వైద్యులు ధ్రువీకరించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 05:41 AM