హైదరాబాద్‌కు వేడిమి ముప్పు!
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:07 AM
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి ముప్పు పొంచి ఉన్న నగరాల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వేడిమికి గురయ్యే ప్రమాదమున్న...
ప్రపంచంలో టాప్-50 నగరాల్లో టీ-రాజధాని
న్యూఢిల్లీ, జూన్ 5: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి ముప్పు పొంచి ఉన్న నగరాల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వేడిమికి గురయ్యే ప్రమాదమున్న టాప్-50 జాబితాలో 38వ స్థానంలో పొందింది. హైదరాబాద్ సహా మన దేశం నుంచి 14 నగరాలు టాప్-50లో ఉండటం గమనార్హం. ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘నగరాల్లో వేడిమి ముప్పును అంచనా వేసే కొత్త ప్రమాణాలు’ పేరిట నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే, కనీసం 10 లక్షల మందికిపైగా జనాభా ఉన్న 205 నగరాల్లో అధ్యయనం చేసినట్టు తెలిపింది. అత్యంత వేడిమి ముప్పు పొంచి ఉన్న టాప్-50 నగరాల్లో భారత్ నుంచే 14 ఉండగా, నైజీరియా 5, పాకిస్థాన్ 4, ఇండోనేషియా 3, ఇరాక్, ఫిలిప్పీన్స్, వియత్నాం, బ్రెజిల్‌లకు చెందిన రెండు చొప్పున నగరాలు ఉన్నాయి. మొత్తంగా ఇరాక్‌లోని అల్ బస్రా నగరం అత్యధిక వేడి ముప్పు ఉన్న నగరాల్లో టాప్‌లో నిలిచింది. మన అహ్మదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. నాగ్‌పూర్ 4, మదురై 7, భోపాల్ 15, కాన్పూర్ 20, పుణె 23, హైదరాబాద్ 38, ముంబై 46వ స్థానాల్లో నిలిచాయి. మరో ఆరు నగరాలు చెన్నై, పాట్నా, లక్నో, బెంగళూరు, జైపూర్, కోల్‌కతా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో వేసవి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్