బెంగాల్ సీఎం మృతిని కోరిన ఎమ్మెల్యే.. తీవ్ర దుమారం తర్వాత యూటర్న్..
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:28 PM
పశ్చిమబెంగాల్‌లోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి మృతిని కోరుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమబెంగాల్‌లోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత, ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి మృతిని కోరుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు (Humayun Kabir comments on CM Suvendu).
సెప్టెంబర్ 27న నిర్వహించిన విలేకరుల సమావేశంలో హుమాయున్ కబీర్ సువేందు అధికారిని తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం అల్లాను ప్రార్థించే సమయంలో ముఖ్యమంత్రిని త్వరగా తీసుకెళ్లిపోవాలని కోరుకుంటానని ఆయన వ్యాఖ్యానించినట్లు కథనాలు వచ్చాయి. గతంలో మరణించిన పలువురు రాజకీయ నాయకుల పేర్లను కూడా ఆయన ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. కబీర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి (Humayun Kabir viral statement).
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వెంటనే కబీర్ మాట మార్చారు (Bengal politics). తాను బీజేపీ నాయకుడు సువెందు అధికారి దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తానని, ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. 'సువెందు అధికారి దీర్ఘాయువుతో ఉండాలని నేను ప్రార్థిస్తాను. సువెందు ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను' అని కబీర్ పేర్కొన్నారు. హుమాయున్ కబీర్ గతంలో కూడా రాజకీయ సభల్లో చేసిన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచారు.
ఇవి కూడా చదవండి..
మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఏవి పని చేయవు.. ఏవి పనిచేస్తాయంటే..
వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..