మహిళ ప్రాణంతీసిన మాంజా
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:55 AM
గాలిపటాన్ని ఎగురవేసేందుకు ఉపయోగించే మాంజా గొంతుకు చుట్టుకుకోవడంతో స్కూటర్‌పై వెళుతున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది ఈ విషాద సంఘటన కర్ణాటకలోని హుబ్బళిలో గురువారం చోటు చేసుకుంది.
స్కూటర్‌పై వెళుతుండగా గొంతుకు బిగుసుకున్న గాలిపటం దారం
హుబ్బళిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతి
బెంగళూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): గాలిపటాన్ని ఎగురవేసేందుకు ఉపయోగించే మాంజా గొంతుకు చుట్టుకుకోవడంతో స్కూటర్‌పై వెళుతున్న మహిళ ప్రాణాలు కోల్పోయింది ఈ విషాద సంఘటన కర్ణాటకలోని హుబ్బళిలో గురువారం చోటు చేసుకుంది. భరత్ నగర్‌కు చెందిన విద్య మంజునాథ్ గౌడ(38) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. భోజనం చేసేందుకు మధ్యాహ్నం ఇంటికి వచ్చి, ఒంటిగంట సమయంలో తిరిగి స్కూటర్‌పై విధులకు వెళుతుండగా శివశంకర కాలనీలో ఆమె మెడకు గాలిపటం దారం (మాంజా) బిగుసుకుంది.
దారం పదునుకు ఆమె గొంతు భాగం తెగిపోయింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే విద్య ప్రాణాలు విడిచారు. మాంజాదారం వినియోగించి గాలిపటాన్ని ఎగురవేసినవారిని గుర్తించి అరెస్టు చేస్తామని హుబ్బళ్లి నగర పోలీసు కమిషనర్ భూషణ్ జి బోరసె తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: