కీలక నగరాల్లో ఇళ్ల ధరలు పైపైకి!
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:31 AM
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. 2021-25 మధ్య 59ు పెరిగినట్లు ‘అనరాక్ రీసెర్చ్’ సంస్థ తాజాగా వెల్లడించింది. నిర్మాణ వ్యయం
నాలుగేళ్లలో 59 శాతం పెరుగుదల
అనరాక్ రీసెర్చ్ సంస్థ నివేదిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. 2021-25 మధ్య 59ు పెరిగినట్లు ‘అనరాక్ రీసెర్చ్’ సంస్థ తాజాగా వెల్లడించింది. నిర్మాణ వ్యయం కూడా 34% పెరిగినట్లు తెలిపింది. భూముల విలువలు పెరగడంతోపాటు.. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, స్టీల్ సంబంధిత నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో నిర్మాణ వ్యయం అదనంగా 8-10% పెరిగినట్లు అనరాక్ తెలిపింది. ప్రామాణిక స్థాయి కంటే మెరుగైన నివాస ప్రాజెక్టు వ్యయం 2021లో చదరపు అడుగుకు రూ.2,681 ఉండేది. 2025 నాటికి రూ.3,604కి చేరుకుంది. అంటే నాలుగేళ్లలోనే దగ్గరదగ్గర వెయ్యి రూపాయలు పెరిగిందన్న మాట. ఇదే సమయంలో నివాస ఆస్తి విలువలు చదరపు అడుగుకు రూ.5,826 నుంచి రూ.9,260కి పెరిగాయి. అంటే సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 12ు పెరిగిందని అనరాక్ గతవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏడు ప్రధాన నగరాలు.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే, కోల్‌కతాల్లో భూముల ధరలు 50ు నుంచి 120ు వరకు పెరిగాయని.. ఢిల్లీలో ఈ పెరుగుదల 70-130 శాతం ఉందని, బెంగళూరులో 60-120 శాతమని అనరాక్ గ్రూపు వైస్‌చైర్మన్ సంతో్‌షకుమార్ తెలిపారు. అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలయ్యాక నిర్మాణ వ్యయం మరింత పెరుగుతోంది. ఒక్క స్టీల్ ధరలే 20ు పెరిగాయి. టీఎంటీ స్టీల్ రాడ్ల ధర టన్నుకు రూ,72 వేలకు చేరింది. చమురు, సైట్ లాజిస్టిక్స్ వ్యయాలు 15-20ు, టైల్స్, గ్లాస్, హార్డ్‌వేర్ సామగ్రి ధరలు 8-12ు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ (ఎంఈపీ) వ్యయం 9-13ు పెరిగాయు. ప్రాజెక్టు వ్యయంలో అన్నిటికంటే ఎక్కువగా లేబర్ వాటా 25-30 శాతానికి చేరింది. పెరిగిన నిర్మాణ వ్యయం ఇప్పటికే ప్రారంభించిన, విక్రయించిన ఇళ్ల ప్రాజెక్టుల లాభాల మార్జిన్‌ను కుదించే అవకాశం ఉందని అనరాక్ విశ్లేషించింది.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు