ఇంటి భోజనమూ పిరమే
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:34 AM
హోటల్‌లో భోజనం ధరలు పెరుగుతుంటాయి.. మరి, ఇంటి భోజనం సంగతి? అది కూడా రోజురోజుకూ పిరమవుతోంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరల కారణంగా ఇంట్లో చేసుకునే భోజనం...
ఉల్లి, వంటనూనె, ఎల్‌పీజీ ధరల పెరుగుదలే కారణం: క్రిసిల్ నివేదిక
ముంబై, సెప్టెంబరు 8: హోటల్‌లో భోజనం ధరలు పెరుగుతుంటాయి.. మరి, ఇంటి భోజనం సంగతి? అది కూడా రోజురోజుకూ పిరమవుతోంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరల కారణంగా ఇంట్లో చేసుకునే భోజనం ఖర్చు కూడా పెరుగుతోందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్‌కు సంబంధించిన పరిశోధన విభాగం ‘క్రిసిల్ ఇంటెలిజెన్స్’ ఆగస్టు నెల నివేదిక ప్రకారం.. మాంసాహార భోజనం ఖర్చు 5ు మేర పెరిగి సగటున రూ.57.50కి చేరుకోగా, శాకాహార భోజనం ఖర్చు 1ు మేర పెరిగి సగటున రూ.29.50కి చేరింది. ఉల్లిగడ్డలు, వంటనూనె, బియ్యం, ఎల్‌పీజీ ధరలు గతేడాదితో పోల్చితే పెరిగిన నేపథ్యంలోనే వంటింటి భోజనం ఖర్చు కూడా అధికమైందని ఈ నివేదిక తెలిపింది. ఆలుగడ్డ, టొమాటో ధరలు తగ్గటం వల్ల.. ఇంటి భోజనం ఖర్చు పెరుగుదల 1-5 శాతానికే పరిమితమైందని, లేకపోతే మరింత ఎక్కువగా ఉండేదని పేర్కొంది. మహారాష్ట్రలో ఈ సీజన్‌లో అకాల వర్షాల కారణంగా పంటనష్టం సంభవించిందని, ఫలితంగా ఉల్లిగడ్డల ధరలు ఆగస్టులో ఏకంగా 43ు పెరిగాయని తెలిపింది. మరోవైపు, వంటనూనెల ధరలు 11ు, ఎల్పీజీ ధర 10ు పెరిగాయని పేర్కొంది. టొమాటో ధరలు 28ు పడిపోయినట్లు గుర్తు చేసింది. ‘రోటీ రైస్ రేట్’ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు