ట్యాక్సీపై విరిగిపడ్డ కొండచరియలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 03:09 AM
హిమాచల్‌ప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతమైన లాహౌల్-స్పితి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాక్సీపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో...
13 మంది మృతి.. హిమాచల్‌లో విషాదం
న్యూఢిల్లీ, జూలై 24: హిమాచల్‌ప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతమైన లాహౌల్-స్పితి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాక్సీపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం 13 మంది మృతిచెందారు. సన్సారీ- కిలాద్- తాండీ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఉదయ్‌పుర్ నుంచి పాంగీకి 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్యాక్సీపై భారీ కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడడంతో అది నుజ్జునుజ్జయింది. కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా ఈ మార్గాన్ని గురువారం మూసివేసిన అధికారులు శుక్రవారం తిరిగి తెరిచారు. సమీప ప్రాంతంలో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. మండి జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడడంతో ఓ మహిళ మృతిచెందగా.. ఏడుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News