15 ఏళ్ల వయసుకే హైబీపీ.. పెరుగుతున్న ముప్పు
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:48 AM
కొందరు హైబీపీని వయసుతో ముడి పెడుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అని..
న్యూఢిల్లీ, జూలై 11: కొందరు హైబీపీని వయసుతో ముడి పెడుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అని వైద్యనిపుణులు అంటున్నారు. హైబీపీ ఏ వయసులోనైనా రావచ్చని హెచ్చరిస్తున్నారు. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న అబ్బాయిల్లో 22ు మంది, అమ్మాయిల్లో 19.4ు మంది అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారని ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. గ్రామీణుల కన్నా పట్టణవాసులకే హైబీపీ ముప్పు ఎక్కువగా ఉంటోందని తెలిపింది. అందుకే చిన్నవయసులోనే బీపీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News