Share News

మాజీ ప్రధాని దేవెగౌడ భార్య చన్నమ్మ కన్నుమూత

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:51 AM

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సతీమణి చన్నమ్మ(85) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలు, ఛాతీలో నొప్పి కారణంగా ఆమెను కుటుంబ సభ్యులు...

మాజీ ప్రధాని దేవెగౌడ భార్య చన్నమ్మ కన్నుమూత

బెంగళూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సతీమణి చన్నమ్మ(85) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలు, ఛాతీలో నొప్పి కారణంగా ఆమెను కుటుంబ సభ్యులు బెంగళూరు హెచ్‌ఏఎల్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శనివారం సాయంత్రం 4.50 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. చన్నమ్మ ఆరోగ్య పరిస్థితి శుక్రవారం రాత్రి విషమించడంతో కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. తన సతీమణి పరిస్థితిని తెలుసుకుని దేవెగౌడ కంటతడిపెట్టారు. వారి కుమారుడు, కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి రెండురోజుల నుంచి ఆస్పత్రి వద్దే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్‌తో తుది వన్డేకు భారత్ సిద్ధం.. లార్డ్స్ గడ్డపై రికార్డు మారేనా?

'రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!

Updated Date - Jul 19 , 2026 | 05:51 AM