Share News

పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక పురస్కారం..

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:30 PM

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనలో ధైర్యంగా వ్యవహరించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారాన్ని ప్రకటించింది.

పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక పురస్కారం..
Smit Machchhar

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనలో ధైర్యంగా వ్యవహరించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఆయనకు 'విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు' అందించనున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తాజాగా ప్రకటించారు (Smit Machchhar award).


కాక్‌పిట్‌లో సహ పైలట్ తనపై దాడి చేసి కత్తితో పొడిచినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యంగా వ్యవహరించి విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని విమానాశ్రయానికి మళ్లించారు. ఈ విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్ఛర్ చూపిన ధైర్యం కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం కెప్టెన్ మచ్ఛర్ సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు (Vishisht Gujarat Garima Award).


కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యాన్ని గుర్తిస్తూ ఆయనకు 'విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు' ఇవ్వనున్నట్లు సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు (Flydubai Flight). మచ్ఛర్ గుజరాత్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. ఆయన కుటుంబం చాలా కాలం క్రితమే ముంబైకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ముంబైలో పెరిగిన ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..


అస్సాంలో 9 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం..

Updated Date - Oct 01 , 2026 | 05:32 PM