ఏఐకి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చు
ABN , Publish Date - Feb 12 , 2026 | 06:25 AM
టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఈపీ) ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్ధంగా లేనివారు వీఈపీ తీసుకోవాలని కోరింది....
ఈ ఏడాదిలో 3వ సారి గూగుల్ ఆఫర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఈపీ) ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్ధంగా లేనివారు వీఈపీ తీసుకోవాలని కోరింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్(జీబీఓ)లో సొల్యూషన్స్ టీమ్, సేల్స్, కార్పొరేట్ డెవల్‌పమెంట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ఆఫర్‌కు అర్హులని కంపెనీ పేర్కొంది. అమెరికాలోని కస్టమర్ సేల్స్ టీమ్, ఇతర కస్టమర్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది. బిజినెస్ ఇన్‌సైడర్ కథనం ప్రకారం గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ కంపెనీ అంతర్గత లేఖలో ఉద్యోగులకు ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘ప్రస్తుత వ్యాపార వాతావరణం ఎంతో వేగంగా మారుతోంది. పోటీ తీవ్రత, పని వేగం గణనీయంగా పెరుగుతున్నాయి. కంపెనీ ఏఐ లక్ష్యాలను అందుకునేలా పనిచేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండక తప్పదు. అందుకు సిద్ధంగా లేమని భావిస్తున్నవారికోసం ఓ ప్రణాళిక సిద్ధంగా ఉంది’ అని షిండ్లర్ తన లేఖలో పేర్కొన్నారు. గూగుల్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ప్రణాళికను ప్రకటించడం ఇది మూడోసారి. గత ఏడాది జూన్, అక్టోబరులో ఇలాంటి ప్యాకేజీలనే ఉద్యోగులకు ఆఫర్ చేసింది.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News