Share News

చెన్నైలో ఘోర రైలు ప్రమాదం.. కాలేజీ బస్సును ఢీకొన్న గూడ్స్ రైలు..

ABN , Publish Date - Mar 14 , 2026 | 08:37 PM

తమిళనాడు రాజధాని చెన్నైలోని కరూర్‌లో ఒక భయంకరమైన రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కరూర్ సమీపంలో ఒక ప్రైవేట్ కాలేజ్ బస్సును గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసం కాగా, 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

చెన్నైలో ఘోర రైలు ప్రమాదం.. కాలేజీ బస్సును ఢీకొన్న గూడ్స్ రైలు..
Chennai Train Accident

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నైలోని(Chennai) కరూర్‌లో ఒక భయంకరమైన రైలు ప్రమాదం(Train Accident) చోటు చేసుకుంది. కరూర్ సమీపంలో ఒక ప్రైవేట్ కాలేజ్ బస్సును గూడ్స్ రైలు(Goods train) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసం కాగా, 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ టీమ్ చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


శనివారం సాయంత్రం కాలేజ్ ముగిసిన తర్వాత విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ కాలేజ్ బస్సు, రైల్వే లెవల్ క్రాసింగ్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. అదే సమయంలో వేగంగా దూసుకు వచ్చిన గూడ్స్ రైలు బస్సును ఢీకొట్టింది. రైలు, బస్సును ఢీకొన్న తర్వాత కొంత దూరం ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రైల్వే గేటు వేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా ట్రాక్ దాటడానికి ప్రయత్నించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మంత్రి ఇంటిపై రాళ్ల దాడి.. యుద్ధక్షేత్రంగా మారిన కోల్‌కతా!

హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం

Updated Date - Mar 14 , 2026 | 08:44 PM