Share News

పూర్తిగా తెలుసుకొని ప్రచారం చేయండి

ABN , Publish Date - Aug 14 , 2026 | 06:09 AM

ఆహార పదార్థాల ఉత్పత్తి కంపెనీల కోసం ప్రచారం చేసే సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఫుడ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు.. ఆ పదార్థాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రజలకు రికమెండ్‌ ...

పూర్తిగా తెలుసుకొని ప్రచారం చేయండి

  • ఫుడ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ కఠిన మార్గదర్శకాలు

  • తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఆహార పదార్థాల ఉత్పత్తి కంపెనీల కోసం ప్రచారం చేసే సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఫుడ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు.. ఆ పదార్థాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రజలకు రికమెండ్‌ చేయాలని భారత ఆహార భద్రత, ప్రమానాల నిర్ణాయక సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఆదేశాలు జారీచేసింది. ఒక ఆహార పదార్థం గురించి వాణిజ్యపరంగా ప్రచారం చేసేముందు దాని తయారీకి ఉపయోగించిన పదార్థాలు, వాటి మోతాదులు, దానిని తింటే కలిగే ప్రయోజనాలు, నష్టాలు తదితర సకల వివరాలను ప్రచారకులు కచ్చితంగా తెలుసుకొని ఉండాలని స్పష్టంచేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గురువారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కంపెనీలు తమ ఉత్పత్తుల గురించి చెప్తున్న వివరాలన్నీ నిజమేనా.. కాదా? అన్నది ముందుగానే నిర్ధారించుకోవాలని సూచించింది. ఆహార పదార్థాల గురించి ఏమీ తెలియకుండానే ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక చిహ్నాలు అవసరంలేదు

తినటానికి సిద్ధంగా ఉండే ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక చిహ్నాలు ముద్రించటానికి ఆహార పరిశ్రమ వర్గాలు సిద్ధంగా లేవని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ తెలిపింది. అందుకు బదులుగా ఒక మనిషికి రోజుకు ఎంతమేర పౌష్టికాహారం అవసరమనే వివరాలతో ఒక పట్టిక ఇస్తే సరిపోతుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ పట్టికలో ఒక మనిషికి రోజుకు ఎంత పంచదార, ఉప్పు, కొవ్వుల వంటివి అవసరమనే వివరాలు ఉంటాయని తెలిపింది. ఈ అఫిడవిట్‌ను ‘న్యూట్రిషన్‌ అడ్వొకసీ ఇన్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌’ (నాపి) తీవ్రంగా వ్యతిరేకించింది.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 06:09 AM