నాటి మావోయిస్టుల ఖిల్లా..నేడు కోడిపందేల అడ్డా
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:16 AM
ఒకప్పుడు మావోయిస్టుల తుపాకీ మోతలతో దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం ఇప్పుడు కోడిపందేలకు అడ్డాగా మారింది
బస్తర్‌లో ఛత్తీస్ గడ్, ఏపీ, తెలంగాణ పందెం రాయుళ్లు
156 మంది అరెస్టు.. రూ.20 లక్షల నగదు స్వాధీనం
రాయ్‌పూర్, నవంబరు 6: ఒకప్పుడు మావోయిస్టుల తుపాకీ మోతలతో దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం ఇప్పుడు కోడిపందేలకు అడ్డాగా మారింది. దట్టమైన అడవుల్లో టెంట్లు, సంగీతం, భోజన ఏర్పాట్లతో భారీస్థాయిలో కోడిపందేల జాతర నిర్వహించారు. రూ.లక్షలు చేతులుమారే ఈ పందేల కోసం చత్తీస్ గడ్ తో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున పందెంరాయుళ్లు తరలివచ్చారు. బీజాపూర్ జిల్లా భద్రకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాయ్‌గూడ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ నెల 3న పోలీసులు దాడి చేసి జూదం గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో 156 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.20 లక్షలకు పైగా నగదు, 47 కార్లు 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంప్రదాయ కోడిపందేల ముసుగులో భారీగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న నిఘావర్గాల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.