Share News

రాజకీయాల్లోకి సీబీఐ మాజీ చీఫ్‌ నాగేశ్వరరావు

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:17 AM

సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావు క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ వేదికగా ఆయన సర్వజన సనాతన పార్టీ (ఎస్‌ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

రాజకీయాల్లోకి సీబీఐ మాజీ చీఫ్‌ నాగేశ్వరరావు
M Nageswara Rao

  • సర్వజన సనాతన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు

న్యూఢిల్లీ, అక్టోబరు 4: సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావు క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీ వేదికగా ఆయన సర్వజన సనాతన పార్టీ (ఎస్‌ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐపీఎస్‌ అధికారిగా వివిధ విభాగాల్లో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించిన అనుభవంతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ పునర్నిర్మాణం కేవలం పరిపాలనా సంస్కరణలకే పరిమితం కాకూడదని అన్నారు. దేశం తన నాగరికతా మూలాలకు కట్టుబడి ఉంటూనే ఆధునిక అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని చెప్పారు.


సనాతనం అనేది కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదని, అది సత్యం, ధర్మం, కర్తవ్యం, కరుణ, న్యాయం, ఆత్మనిగ్రహం, ప్రకృతి, కుటుంబం, సమాజం, ప్రజా సంక్షేమం వంటి విలువలపై ఆధారపడిన జీవన విధానమని వివరించారు. విద్య, ఆరోగ్యం. జీవనోపాధి, నాగరికతతో అనుసంధానం అనే నాలుగు కీలక అంశాలు ఎస్‌ఎస్‌పీకి మూలస్తంభాలని ఆయన అభివర్ణించారు. గతంలోకి తిరిగి వెళ్లడం కాకుండా, భారత నాగరికత మూలాలను కాపాడుకుంటూ, ఆధునిక భారత్‌ను నిర్మించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఏ కులానికి, ఏ వర్గానికి ఎస్‌ఎ్‌సపీ వ్యతిరేకం కాదని, అందరి సంక్షేమం కోసం పనిచేస్తామని నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...
ఖర్గే వ్యాఖ్యలు ప్రజల విచక్షణను అవమానించడమే

పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్‌!

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 07:17 AM