Share News

గువాహటీలో కాల్పులు..ఐదుగురి మృతి

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:45 AM

అస్సాంలోని గువాహటీలో ఉన్న హోటల్‌ బిలాస్‌ ఇన్‌ వద్ద సోమవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.

గువాహటీలో కాల్పులు..ఐదుగురి మృతి
fire

గువాహటీ, అక్టోబరు 26: అస్సాంలోని గువాహటీలో ఉన్న హోటల్‌ బిలాస్‌ ఇన్‌ వద్ద సోమవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. ఒక మహిళతో పాటు పలువురు గాయపడ్డారు. ఆ హోటల్‌ ఎదురుగా ఉన్న బోరా సర్వీసు కేంద్రం సమీపంలోని కల్యాణ్‌ జ్యువెలరీ షాపు వద్ద ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించినవారు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఇందుకు కారకులు ఎవరు, కారణాలు ఏమిటన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

Updated Date - Oct 27 , 2026 | 04:46 AM