ఈవీ కార్లకు ప్రాధాన్యమివ్వండి
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:49 AM
శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, హరిత రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది
వివిధ మంత్రిత్వ శాఖలను కోరిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ, నవంబరు 11: శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, హరిత రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు సిబ్బందికి కార్ల కొనుగోలు విషయంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను డీఫాల్డ్, ప్రాధాన్య ఎంపికగా పరిణించాలని కోరింది. ప్రస్తుతమున్న సంప్రదాయ కార్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటి స్థానంలో కొత్తగా ఈవీలను కొనుగోలు చేయాలని ఆర్థిక శాఖ వ్యయ విభాగం తాజాగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు పంపిన మెమోరాండంలో పేర్కొంది. అదేవిధంగా ప్రభుత్వం అవసరాలకు వాహనాలను అద్దెకు తీసుకొనే విషయంలో కూడా ఈవీలకే ప్రాధాన్యమివ్వాలంది.
ఇవి కూడా చదవండి..
వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి
దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు