Share News

రూ.500 హ్యాండ్‌బ్యాగ్‌.. రూ. 8.3 లక్షలు

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:26 AM

ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘ఫెండీ’ సరికొత్తగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ఓ హ్యాండ్‌బ్యాగ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నవరాత్రుల సమయంలో...

రూ.500 హ్యాండ్‌బ్యాగ్‌.. రూ. 8.3 లక్షలు

హస్త లాఘవం

భారతీయ కళకు ఇటాలియన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ కాపీ!.. లగ్జరీ సొబగులతో విక్రయాలు

  • ఈ దోపిడీ ఇంకెన్నాళ్లు?.. చేతివృత్తుల కళాకారులకు ఇదా గుర్తింపు?

  • హర్ష్‌ గోయెంకా, మజుందార్‌ షా ఫైర్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ప్రముఖ ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘ఫెండీ’ సరికొత్తగా మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ఓ హ్యాండ్‌బ్యాగ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నవరాత్రుల సమయంలో రాజస్థాన్‌, గుజరాత్‌ వీధుల్లో లభించే రూ. 500 విలువైన సంప్రదాయ అద్దాలు, పూసల సంచులను పోలి ఉన్న ఈ ‘ఫెండీ బ్యాగు’ను సంస్థ ఏకంగా రూ. 8.3లక్షలకు విక్రయిస్తుండటమే ఇందుకు కారణం. భారతీయ హస్తకళను కాపీ కొట్టడమే కాకుండా లగ్జరీ బ్రాండ్‌ పేరిట రీప్యాకేజ్‌ చేయడంపై పలువురు పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. ఈ నైపుణ్యానికి కారకులైన కళాకారులకు కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పూర్తిగా చేతితో నేసిన ఈ బ్యాగ్‌ తయారీలో 39,500 పూసలు, 475 అద్దాలను ఉపయోగించామని, దీనికి 138గంటలకు పైగా సమయం పట్టిందని సంస్థ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, గతంలో ప్రసిద్ధ బ్రాండ్‌ ‘ప్రాదా’ మహారాష్ట్ర సంప్రదాయ ‘కొల్హాపూర్‌’ చెప్పుల డిజైన్‌ ను కాపీ కొట్టిన అమ్మిన ఘటనను గుర్తు చేస్తూ.. ఆర్పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌గోయెంకా ఎక్స్‌లో నిలదీశారు. ‘‘గుజరాత్‌ వీధుల్లో లభించే రూ.500 బ్యాగు డిజైన్‌ను రూ. 8లక్షలకు అమ్ముతున్నారు. పాశ్యాత్య లగ్జరీ బ్రాండ్లు మన కళలను దోచుకోవడం ఇంకెప్పుడు ఆపుతాయి?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షా స్పందిస్తూ.. ఇది సంస్కృతిని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 06:30 AM