రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:02 PM
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి కోసం ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ దరఖాస్తు చేసుకున్నారు.
అయోధ్య/న్యూఢిల్లీ, జులై 14: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నియామక ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పదవి కోసం ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ దరఖాస్తు చేసుకోవడంతో ఈ రేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అమితాబ్ ఠాకూర్ 1992 బ్యాచ్‌కు చెందిన యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి.
వివాదాస్పద నేపథ్యం.. ఐపీఎస్ నుంచి రాజకీయాల వైపు
నిర్బంధ పదవీ విరమణ: పలు శాఖాపరమైన విచారణలు, క్రమశిక్షణా ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయన సర్వీసులో కొనసాగడానికి 'అనర్హుడు' అని పేర్కొంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్చి 23, 2021న ఆయనకు నిర్బంధ పదవీ విరమణ (Compulsory Retirement) కల్పించింది. సాధారణంగా అయితే ఆయన 2028 వరకు సర్వీసులో ఉండాల్సి ఉంది.
రాజకీయ రంగప్రవేశం: పదవీ విరమణ తర్వాత ఆయన ‘అధికార్ సేన’ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ, చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు.
అమితాబ్ ఠాకూర్ డిమాండ్
'ట్రస్ట్ ఖాతాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఎప్పుడూ ఆడిట్ చేయలేదని, ఇది ఒక స్వతంత్ర సంస్థ అని ట్రస్ట్ చెబుతోంది. ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ట్రస్ట్ తన పత్రాలు, వార్షిక నివేదికలు, ఆర్థిక నివేదికలను బహిరంగంగా ప్రజల ముందు ఉంచాలి' అని అమితాబ్ ఠాకూర్ డిమాండ్ చేశారు.
కాగా, భక్తుల కానుకల దొంగతనం/దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో రామాలయ ట్రస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పారదర్శకతను పెంచడానికి, పరిపాలనను బలోపేతం చేయడానికి ట్రస్ట్ ఓ ప్రొఫెషనల్ సీఈఓను నియమించాలని నిర్ణయించింది. ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా నిరోధించడానికి, సంస్థాగత జవాబుదారీతనాన్ని పెంచడానికి అనుభవజ్ఞుడైన అధికారి అవసరం ఉందని స్పష్టం చేశారు.
దరఖాస్తుకు అర్హతలు ఏంటి?
సీఈఓ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 18 వరకు గడువు ఉంది. దీనికి కీలకమైన 15 నిబంధనలు/అర్హతలను విధించారు.
హిందూ మతాచారాలు పాటించే వ్యక్తి: దరఖాస్తుదారు తప్పనిసరిగా హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తి, రామభక్తుడై ఉండాలి.
పరిపాలనా అనుభవం: పెద్ద సంస్థలను విజయవంతంగా నడిపించిన సుదీర్ఘ పరిపాలనా అనుభవం కలిగి ఉండాలి.
పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకునేలా రోజువారీ ఆలయ పరిపాలనను పర్యవేక్షించడం, ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడం, సిబ్బందిని నిర్వహించడం కొత్త సీఈఓ ప్రధాన బాధ్యతలు. ఈ నేపథ్యంలో ఈ పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
దొంగతనం చేశారనే అనుమానంతో కరెంట్ షాక్.. వీడియో వైరల్
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్..