మాజీ అగ్నివీర్‌లకు అద్భుత చాన్స్
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:52 AM
అగ్నివీర్‌లకు కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలందించి రిటైరయ్యే అగ్నివీర్‌లు కేంద్ర సాయుధ బలగాల్లోని..
కేంద్ర సాయుధ బలగాల పోస్టుల్లో
50% కోటా.. రాత, దారుఢ్య పరీక్షలు నో!
న్యూఢిల్లీ, జూలై 22: అగ్నివీర్‌లకు కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించింది. నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలందించి రిటైరయ్యే అగ్నివీర్‌లు కేంద్ర సాయుధ బలగాల్లోని పోస్టులను సునాయాసంగా దక్కించుకునే వెసులుబాటు ఇచ్చింది. కానిస్టేబుల్, రైఫిల్‌మన్ వంటి ఉద్యోగాల్లో మాజీ అగ్నివీర్‌లకు 50ు రిజర్వేషన్ కల్పించింది. అలాగే, రాత, దేహ దారుఢ్య పరీక్షలు కూడా ఉండబోవని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటులో బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆయా పోస్టుల నిబంధనల మేరకు సాధారణ గరిష్ఠ వయోపరిమితికి మరో మూడేళ్లు అదనపు వయో పరిమితి మాజీ అగ్నివీర్‌లకు లభిస్తుందని తెలిపారు.
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి