స్మశానాన్నీ వదల్లేదు.. సమాధిపై గ్రానైట్ పలక చోరీ.. కేరళలో షాకింగ్ ఘటన
ABN , Publish Date - Jul 29 , 2026 | 02:04 PM
కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఓ విచిత్రమైన చోరీ ఘటన స్థానికులను విస్మయానికి గురిచేసింది. మల్లప్పల్లి సమీపంలోని జియాన్ మార్తోమా చర్చి స్మశానవాటికలో ఓ సమాధిపై అమర్చిన భారీ గ్రానైట్ పలకను దుండగులు చోరీ చేశారు.
కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఓ విచిత్రమైన చోరీ ఘటన స్థానికులను విస్మయానికి గురిచేసింది. మల్లప్పల్లి సమీపంలోని జియాన్ మార్తోమా చర్చి స్మశానవాటికలో ఓ సమాధిపై అమర్చిన భారీ గ్రానైట్ పలకను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు (Kerala Tomb Theft).
చర్చి స్మశానవాటికలో ఉన్న ఓ సమాధిపై ఉన్న గ్రానైట్ పలక కనిపించకపోవడంతో నిర్వాహకులకు కొందరు సమాచారం అందించారు. అనంతరం చర్చి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమాధిలో ఇద్దరి మృతదేహాలు ఖననం చేసినట్లు అధికారులు తెలిపారు. చోరీకి గురైన గ్రానైట్ పలక చాలా భారీగా ఉంటుందని, దానిని ఒక్క వ్యక్తి ఎత్తుకెళ్లడం అసాధ్యమని, వాహనం ఉపయోగించి ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు (Granite Slab Theft).
స్మశానవాటిక వద్ద, పరిసర రహదారులపై సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది (Kerala News). సమీప ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా, విదేశాల్లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులు తిరిగి వచ్చిన తర్వాత వారి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..