ఈఎస్ఐ క్లెయిమ్‌లలో కీలక మార్పులు.. ఇక ఆటోమేటిక్ ప్రాసెసింగ్
ABN , Publish Date - Nov 22 , 2026 | 10:09 PM
తన పరిధిలోని శ్రామికులు, ఉద్యోగులకు కార్మిక రాజ్యబీమా సంస్థ(ఈఎస్ఐ) శుభవార్త చెప్పింది. బీమా క్లెయిమ్‌ల నిబంధనలను ఈఎస్ఐ సులభతరం చేసింది. ఈ మేరకు అనారోగ్య, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: తన పరిధిలోని శ్రామికులు, ఉద్యోగులకు కార్మిక రాజ్యబీమా సంస్థ(ఈఎస్ఐ) శుభవార్త చెప్పింది. బీమా క్లెయిమ్‌ల నిబంధనలను ఈఎస్ఐ సులభతరం చేసింది. ఈ మేరకు అనారోగ్య, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై అనారోగ్యం, మెటర్నిటీ క్లెయిమ్‌లను ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. అంటే ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే కార్మికులు, ఉద్యోగులు డీబీటీ ద్వారా ఆన్‌లైన్‌లో నిధులు పొందొచ్చు. పని స్థలంలో జరిగే ప్రమాదాలకు సంబంధించిన క్లెయిమ్‌ల నిబంధనలను కూడా ఈఎస్ఐ సవరించింది. ఇదివరకు ప్రమాదం జరిగిన సందర్భాల్లో బీమా క్లెయిమ్ కోసం రెండు సార్లు (మొదట యజమాని రిపోర్ట్ చేయాలి, తరువాత కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలి) అప్లై చేయాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై పని ప్రదేశాలో ప్రమాదాలను యజమాని ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేస్తే చాలు. నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ వార్తలూ చదవండి
రేవంత్ ఆ పని చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేటీఆర్ ఛాలెంజ్
హైదరాబాద్‌లో గంజాయి మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం