ఇంధన భద్రతే గల్ఫ్ దేశాలతో జరిగిన చర్చల్లోని కీలకాంశం.. విదేశాంగ మంత్రిత్వ శాఖ
ABN , Publish Date - Jul 14 , 2026 | 07:45 PM
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల గల్ఫ్ ప్రాంతంలోని నాలుగు దేశాలలో జరిపిన పర్యటనలో 'ఇంధన భద్రత' అత్యంత కీలకమైన అంశంగా నిలిచిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఢిల్లీ, జులై 14: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల గల్ఫ్ ప్రాంతంలోని నాలుగు దేశాలలో జరిపిన పర్యటనలో 'ఇంధన భద్రత' (Energy Security) అత్యంత కీలకమైన అంశంగా నిలిచిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. దీంతో పాటు పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలపై కూడా విస్తృత చర్చలు జరిగాయని పేర్కొంది.
ఇవాళ ఢిల్లీలో జరిగిన వారంతపు మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ పర్యటనలకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఈ నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలలో పర్యటించి, ఆయా దేశాల అగ్రనాయకత్వంతో, తన సహచర మంత్రులతో విస్తృతస్థాయి చర్చలు జరిపారని వెల్లడించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, భారత విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.. భారతదేశ ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమైన చమురు, గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవడానికి, అంటే 'ఇంధన భద్రత'ను కాపాడుకోవడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమలాపురంలో రైతుల ఆందోళన.. ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి.. రైతులకు మంత్రి తుమ్మల సూచన