Share News

ఫారం-6, డిక్లరేషన్‌ ఇక వేర్వేరుగానే

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:44 AM

ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారం-6, దానికి అనుబంధంగా డిక్లరేషన్‌ (ధ్రువీకరణ) పత్రాలను ఆన్‌లైన్‌లో వేర్వేరుగా సమర్పించేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) మార్పులు చేసింది.

ఫారం-6, డిక్లరేషన్‌ ఇక వేర్వేరుగానే
voterlist

  • ఆన్‌లైన్‌లో విడిగా సమర్పించేందుకు మార్పులు చేసిన ఈసీ

న్యూఢిల్లీ, నవంబర్‌ 4: ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారం-6, దానికి అనుబంధంగా డిక్లరేషన్‌ (ధ్రువీకరణ) పత్రాలను ఆన్‌లైన్‌లో వేర్వేరుగా సమర్పించేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) మార్పులు చేసింది. సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ రూపంలో తాను ఇచ్చిన హామీ మేరకు.. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఈ మార్పును అమల్లోకి తీసుకొచ్చింది. సర్‌ పూర్తయిన రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ డిక్లరేషన్‌ ఫారంను ఎన్నికల సంఘం ఇప్పటికే తొలగించడం గమనార్హం. బిహార్‌లో సర్‌ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఫారం-6 దాఖలు చేసే వారి తల్లిదండ్రుల వివరాలు కోరుతూ ఈసీ అదనపు డిక్లరేషన్‌ను జత చేసింది. భౌతికంగా పేపర్‌ రూపంలో దరఖాస్తులు నింపే వారు ఫారం-6, డిక్లరేషన్‌ను విడివిడిగానే సమర్పించాల్సి ఉండగా, ఆన్‌లైన్‌లో మాత్రం ఒకటే ఓటీపీ ద్వారా రెండు పత్రాలను ఒకేసారి పూర్తిచేసే విధానాన్ని ఈసీ అమలు చేసింది. తాజా మార్పుతో ఫారం-6, డిక్లరేషన్‌ను ఇకపై విడివిడిగా, వేర్వేరు ఓటీపీలతో దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మీ కుమార్తె సుప్రియ సిద్ధంగా ఉన్నారు.. శరద్ పవార్‌తో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ!

ట్రంప్‌నకు ఎదురుదెబ్బ.. మేము కూడా అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు..

Updated Date - Nov 05 , 2026 | 06:45 AM