24 గంటల్లో మీ వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:34 AM
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బుధవారం ఈసీ నోటీసు జారీ చేసింది. ప్రధాని మోదీని ‘టెర్రరిస్టు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై...
కఠిన పదాలతో ఖర్గేకు ఈసీ నోటీసు
ఇది రాజ్యాంగంపై దాడి: కాంగ్రెస్
ఖర్గే ప్రచారంపై నిషేధం విధించండి: ఈసీకి బీజేపీ వినతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బుధవారం ఈసీ నోటీసు జారీ చేసింది. ప్రధాని మోదీని ‘టెర్రరిస్టు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ కఠినమైన పదాలతో నోటీసు ఇచ్చింది. తమిళనాడు, బెంగాల్ ఎన్నికలకు ఒకరోజు ముందు నోటీసు జారీ కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో స్పందించారు. ‘ఈసీ రాజ్యాంగ సంస్థ. కాని, దాని ప్రవర్తన రాజ్యాంగంపై దాడి చేస్తున్నట్లు, అవమానిస్తున్నట్లు ఉంది. దీనికి ప్రధాన బాధ్యత సీఈసీదే. ప్రధాని, హోం మంత్రి చెప్పినట్ల ఈసీ ఆడుతోంది’ అని రమేశ్ ఆరోపించారు. దీనికి ముందు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరెన్ రిజుజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, పలువురు బీజేపీ నేతల బృందం ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్‌ను కలిసింది. ఖర్గే ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమేనంటూ సవివరణాత్మక ఫిర్యాదును ఈసీకి అందజేసింది. ఖర్గే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదేశించాలని కోరింది. దీనికి ముందు హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోదీని అవమానించడం అంటే ఆయనను ప్రేమించే, మద్దతు ఇచ్చే కోట్లాది మంది ప్రజలను అవమానించడమే’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International