ఎల్‌నినోతో చక్కెర ఉత్పత్తిలో తగ్గుదల!
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:31 AM
ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సీజన్ (2026-27)లో భారతదేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గనుంది! 2027 సెప్టెంబరుతో ముగిసే ఏడాదిలో దేశంలో..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సీజన్ (2026-27)లో భారతదేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గనుంది! 2027 సెప్టెంబరుతో ముగిసే ఏడాదిలో దేశంలో మొత్తం చక్కెర ఉత్పత్తి 29-31 మిలియన్ టన్నుల మధ్య ఉంటుందని వ్యాపారులు, విశ్లేషకులు, మిల్లు యాజమాన్యాల అంచనాలపై చేసిన సర్వే ఆధారంగా బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ప్రస్తుత సీజన్‌లో ఇది 31 మిలియన్ టన్నులుగా ఉంటుందని ఇండియన్ షుగర్ అండ్ బయోఎనర్జీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. చక్కెర ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో వచ్చే సీజన్‌లో చక్కెర ఉత్పత్తి పడిపోనుందన్న అంచనాల నేపథ్యంలో ఇది సరఫరా వ్యవస్థలను మరింత కఠినతరం చేయనుంది. బలపడుతున్న ఎల్‌నినో ఆసియా అంతటా పంటలపై ప్రభావం చూపుతుందని, దీని వల్ల సుమారు 2.6 లక్షల టన్నుల ప్రపంచస్థాయి కొరత ఏర్పడవచ్చని ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది మేలో హెచ్చరించింది. కాగా, 2026-27 సీజన్‌లో ఉత్పత్తి తగ్గనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది న్యూయార్క్‌లో ముడి చక్కెర ఫ్యూచర్స్ ధరలు 30శాతం పెరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం