5 నిమిషాల్లోనే 80 మంది భారతీయ ఉద్యోగుల తొలగింపు
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:46 AM
అమెరికాలో సాధారణంగా సాయంత్రం షిఫ్టులో పనిచేసే ఉద్యోగులకు గూగుల్ మీట్‌తో విధులు ముగుస్తాయి. కానీ అమెరికాలోని ఓ బ్యాంకులో పనిచేసే 80 మంది భారతీయ ఉద్యోగులకు ఓ గూగుల్ మీట్ విషాదాన్ని నింపింది. కేవలం అయిదంటే అయిదు నిమిషాల వ్యవధిలో వారందర్నీ మూకుమ్మడిగా ఉద్యోగం నుంచి తొలగించారు.
అమెరికాలో బ్యాంకు నిర్ణయం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: అమెరికాలో సాధారణంగా సాయంత్రం షిఫ్టులో పనిచేసే ఉద్యోగులకు గూగుల్ మీట్‌తో విధులు ముగుస్తాయి. కానీ అమెరికాలోని ఓ బ్యాంకులో పనిచేసే 80 మంది భారతీయ ఉద్యోగులకు ఓ గూగుల్ మీట్ విషాదాన్ని నింపింది. కేవలం అయిదంటే అయిదు నిమిషాల వ్యవధిలో వారందర్నీ మూకుమ్మడిగా ఉద్యోగం నుంచి తొలగించారు. కస్టమర్ సర్వీసు విభాగానికి చెందిన వారు సాయంత్రం 6.30 షిఫ్టులో పనిచేస్తుంటారు. ఆ రోజున వారిని వర్క్ ఫ్రం హోం చేయాలని సంబంధిత అధికార్లు సూచించారు. రాత్రి 9.30కి గూగుల్ మీట్ ఉందని చెప్పారు. ఏదో రొటీన్ మీటింగ్ అని అనుకుంటే మొత్తం 80 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించారు. భారతీయ బృందం పనితీరు ఆశించినంతగా లేనందునే తొలగించినట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్ మ్యాప్‌లతో పరిశీలన
భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్ రావు