కరెంట్ షాక్‌తో 8మంది రోడ్డు నిర్మాణ కూలీల మృతి
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:38 AM
రోడ్డు నిర్మాణపనుల్లో నిమగ్నమై ఉన్న కూలీలను మృత్యువు కరెంట్ షాక్ రూపంలో కబళించింది.
రాజస్థాన్‌లోని ఛాపోలీ గ్రామంలో విషాదం
జైపూర్, నవంబరు 2: రోడ్డు నిర్మాణపనుల్లో నిమగ్నమై ఉన్న కూలీలను మృత్యువు కరెంట్ షాక్ రూపంలో కబళించింది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూ జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయపూర్వతీ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ఛఫోలీ గ్రామంలో.. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తీసుకొచ్చిన కంకర కలిపే యంత్రానికి ప్రమాదవశాత్తూ పైనున్న హైటెన్షన్ కరెంట్ వైర్లు తగిలాయి. దీంతో యంత్రమంతటా ఒక్కసారిగా భారీ విద్యుత్ ప్రసారమై, అక్కడ పనిచేస్తున్న కూలీలు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు అందిస్తామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి