రూ.440 కోట్ల టీఎంసీ డిపాజిట్లు ఫ్రీజ్
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:15 AM
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోని మూడు ఖాతాల్లో ఉన్న రూ.440.42 కోట్ల డిపాజిట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద...
న్యూఢిల్లీ, జూలై 8: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులోని మూడు ఖాతాల్లో ఉన్న రూ.440.42 కోట్ల డిపాజిట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు బుధవారం వెల్లడించింది. మంగళవారం కోల్‌కతాలోని 5ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. వీటిలో ప్రైవేట్ విమానాలు, చార్టర్డ్ సేవలు అందించే కేర్‌వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేసింది. టీఎంసీ బ్యాంకు ఖాతాల్లో 2023 ఏప్రిల్ నుంచి 2026 జూన్ మధ్య సుమారు రూ.160 కోట్లు కేర్‌వెల్ ఏవియేషన్‌కు, దాని అనుబంధ సంస్థలకు బదిలీ అయినట్లు గుర్తించింది. ఆ డబ్బులతో విమానం, హెలికాప్టర్ కొన్న కేర్‌వెల్ కంపెనీ వాటిని తిరిగి టీఎంసీకే అద్దెకు ఇచ్చిందని ఈడీ తెలిపింది.
ఇవీ చదవండి:
ఎన్నికల విజయంపై న్యాయపోరు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు
ఢిల్లీ నుంచి సిలిగురికి 6 గంటల్లో.. పట్టాలెక్కిన బుల్లెట్ రైల్ ప్లాన్