పినరయి విజయన్‌పై అవినీతి కేసు పెట్టండి
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:51 AM
కేరళంలో చోటుచేసుకున్న సీఎంఆర్‌ఎల్-ఎక్సలాజిక్ ‘నెలవారీ చెల్లింపుల’ కేసును అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు జరపాలని రాష్ట్ర పోలీసులకు...
ఆయన కుమార్తెపై కూడా...కేరళం పోలీసులకు ఈడీ లేఖ
తిరువనంతపురం, సెప్టెంబరు 8: కేరళంలో చోటుచేసుకున్న సీఎంఆర్‌ఎల్-ఎక్సలాజిక్ ‘నెలవారీ చెల్లింపుల’ కేసును అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు జరపాలని రాష్ట్ర పోలీసులకు ఈడీ సూచించింది. ఈ కేసులో మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ, సీపీఎంకు చెందిన మాజీ మంత్రి మహమ్మద్ రియా్‌సలకు రూ.3.28 కోట్లు ముట్టినట్టు ఈడీ ఆరోపించింది. ఇది లంచాల సొమ్మేని ఆరోపించింది. విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సొమ్ము బదిలీ జరిగిందని, దానిని మహమ్మద్ రియాస్ వివిధ మార్గాల ద్వారా దుబాయ్ పంపించారని తెలిపింది. 2017-18 నుంచి 2019-20 మధ్య తగిన సేవలు అందించకుండానే వీణకు చెందిన ఎక్స్‌లాజిక్ సంస్థకు సీఎంఆర్‌ఎల్ 1.72 కోట్ల మేర చెల్లించినట్టు తొలుత ఆదాయపు పన్ను విభాగం సెటిల్‌మెంట్ బోర్డు గుర్తించింది. దీనిపై ‘తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం’ లోతుగా విచారణ జరపగా మరికొన్ని అక్రమాలు జరిగినట్టు గుర్తించింది.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా
రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు