Share News

చలికాలం ముందుగానే మొదలైందా.. ఉష్ణోగ్రతలు ఎందుకు పడిపోయాయంటే..

ABN , Publish Date - Sep 28 , 2026 | 03:56 PM

ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రాంతాల్లో మంచు కురవడం అప్పుడే మొదలైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో ఈ సీజన్‌లో తొలిసారిగా మంచు కురిసింది.

చలికాలం ముందుగానే మొదలైందా.. ఉష్ణోగ్రతలు ఎందుకు పడిపోయాయంటే..
Early winter India 2026

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రాంతాల్లో మంచు కురవడం అప్పుడే మొదలైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో ఈ సీజన్‌లో తొలిసారిగా మంచు కురిసింది. రోహ్‌తాంగ్‌ పాస్‌ పరిసరాల్లో కూడా స్వల్పంగా మంచు పడింది. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఈ ఏడాది శీతాకాలం ముందుగానే వచ్చిందా? అనే చర్చ మొదలైంది (Early winter India 2026).


గత కొన్ని రోజులుగా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. ఢిల్లీలో కూడా సెప్టెంబర్‌ 27న కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. 2001 తర్వాత సెప్టెంబర్ నెలలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. సాధారణం కంటే సుమారు మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితిని అస్థిరమైన వాతావరణ నమూనాగా చూడాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు (North India temperature drop).


హిమాలయాల్లో రుతుపవన కాలంలోనూ, శీతాకాలంలోనూ మంచు కురవడం సహజమేనని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ మాజీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ డీపీ దోభాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తర భారతంలో కనిపిస్తున్న చల్లటి వాతావరణం ప్రధానంగా వర్షాలు, మంచు, మేఘావృత పరిస్థితులు, మారుతున్న వాతావరణ నమూనాలతో ముడిపడి ఉందన్నారు. ఇక, హిమాలయాల్లో 4,000 మీటర్ల ఎత్తున ఉన్న ప్రాంతాల్లో గతంలో మంచు కురిసే చోట ఇప్పుడు వర్షం పడుతోందని ఆయన చెప్పారు. (Himalayan snowfall).


గత పదేళ్లలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవి ఎక్కువ కాలం కొనసాగుతోందని, అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా మంచు, నేలపై ఎక్కువకాలం నిలిచే పరిస్థితిని ప్రభావితం చేస్తున్నాయని ఆయన తెలిపారు. హిమాలయ ప్రాంతాల్లో మారుతున్న వర్షపాతం, మంచు కురిసే సమయం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక వాతావరణ మార్పులపై ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..


పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..

Updated Date - Sep 28 , 2026 | 03:56 PM