Share News

ఇంధన సామర్థ్యంపై ఈ-20 ప్రభావం లేదు

ABN , Publish Date - Jul 15 , 2026 | 06:07 AM

పెట్రోల్‌లో ఇథనాల్‌ 20ు కలపడం వల్ల వాహన ఇంధన సామర్థ్యంలో ఎలాంటి తగ్గుదల తమ అధ్యయనంలో కనిపించలేదని ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు మంగళవారం వెల్లడించారు..

ఇంధన సామర్థ్యంపై ఈ-20 ప్రభావం లేదు

  • ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు వెల్లడి

కాన్పూర్‌, జూలై 14: పెట్రోల్‌లో ఇథనాల్‌ 20ు కలపడం వల్ల వాహన ఇంధన సామర్థ్యంలో ఎలాంటి తగ్గుదల తమ అధ్యయనంలో కనిపించలేదని ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుత లేదా పాత వాహనాలకు నష్టం కలిగించే ఏ ఒక్క ఆధారం కూడా కనిపించలేదని స్పష్టం చేశారు. కొన్ని వాహనాల్లో ఈ-20 పెట్రోల్‌ వల్ల 5ు మైలేజీ తగ్గొచ్చని ఇటీవలే ఇంధన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే 5ు వరకు తగ్గుదల అనేది చాలా కారణాల వల్ల ఉండొచ్చని ఐఐటీ కాన్పూర్‌లోని ఇంజిన్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ ప్రాజెక్టు సైంటిస్ట్‌ ధ్రువ్‌ రాజ్‌ అభిప్రాయపడ్డారు. స్వచ్ఛమైన పెట్రోల్‌తో పరీక్షలు చేసినా ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు. ఈ-20 వల్ల ఇంజిన్‌ దెబ్బతినడం, తుప్పుపట్టడం, ఇతర మెకానిక్‌ సమస్యలు ఏవీ రావన్న విషయం తమ విస్తృత పరీక్షల్లో స్పష్టమైందని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు

రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!

Updated Date - Jul 15 , 2026 | 06:07 AM