ఈ-10 పెట్రోల్‌ను మళ్లీ తేవాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:15 AM
దేశవ్యాప్తంగా ఈ-20పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అనంత నాగేశ్వరన్ కీలక, ఆసక్తికర సూచనలు చేశారు. వాహనదారుల ఆందోళన నేపథ్యంలో...
అన్ని బంకుల్లో ఈ-20తో పాటు అందుబాటులో ఉంచాలి
అప్పుడే వాహనదారుల్లో ఉన్న ఆందోళన తొలగిపోతుంది
ఈ-20తో ఇంజన్లు పాడవ్వవు.. కానీ వేడెక్కే అవకాశం ఉంది
ఓ పత్రికకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు
అనంత నాగేశ్వరన్ వ్యాసం
ఈ అభిప్రాయాలు తన వ్యక్తిగతమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశవ్యాప్తంగా ఈ-20పై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) అనంత నాగేశ్వరన్ కీలక, ఆసక్తికర సూచనలు చేశారు. వాహనదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ10 పెట్రోల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఈ-20తో పాటు ఈ-10 ఇంధనం కూడా అందుబాటులో ఉండాలన్నారు. అప్పుడే వాహనదారుల్లో ఆందోళన తొలగిపోతుందని పేర్కొన్నారు. అయితే, ఈ20 పెట్రోల్‌తో వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయన్న అనుమానాలను ఆయన కొట్టిపారేశారు. కానీ, ఇథనాల్ బ్లెండింగ్ ఇంధనం వల్ల అవి బాగా వేడెక్కే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఈ20 పెట్రోల్‌తో పాత టూవీలర్లలోని రబ్బరు సీల్స్ పాడవుతాయన్నారు. ఈ మేరకు అనంతనాగేశ్వరన్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కన్సల్టెంట్ ఆకాశ్ పూజారీతో కలిసి ఇండియన్ ఎక్స్‌ప్రె్‌సలో వ్యాసం రాశారు. కేంద్రప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఓ అధికారి ఈ20 పెట్రోల్‌పై స్పందించడం ఇదే మొదటిసారి. బీఎస్-4 మోడల్ కంటే ముందువి 8కోట్ల టూవీలర్లు ఇంకా రోడ్లపై తిరుగుతున్నాయని అనంతనాగేశ్వరన్ అంచనా వేశారు. ఈ-20 విషయంలో మైలేజీ, ఇంజన్ల కంటే ముఖ్యమైన అంశం పంటల సాగులో మార్పులు అని చెప్పారు. వంట నూనెల దిగుమతులను పెంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఇథనాల్ తయారీలో మొక్కజొన్న పంట ప్రధానంగా ఉందని గుర్తు చేసిన ఆయన, కేంద్రం ప్రోత్సాహంతో ప్రజలు దీన్ని సాగు చేయడానికే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. ఫలితంగా సోయా, వేరుశనగ, ఆవాలు లాంటి నూనె పంటల సాగు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే మొక్కజొన్న, చెరకు పంటలు పండించడానికి నీళ్లు చాలా అవసరమని ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని సూచించారు.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా