డీఆర్‌డీఓ మిసైల్ టెక్నాలజీ బదిలీకి రాజ్‌నాథ్ ఆమోదం..
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:48 PM
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన అన్ని కన్వెన్షనల్ మిసైల్ సిస్టమ్స్‌ను.. ఇండియన్ ఇండస్ట్రీస్ ఫర్ ఇండీజినస్ ప్రొడక్షన్‌కు బదిలీ చేయడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ఆమోదం తెలిపారు.
ఇంటర్‌నెట్ డెస్క్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన అన్ని కన్వెన్షనల్ మిసైల్ సిస్టమ్స్‌ను.. ఇండియన్ ఇండస్ట్రీస్ ఫర్ ఇండీజినస్ ప్రొడక్షన్‌కు బదిలీ చేయడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, స్థానిక తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
అర్హత కలిగిన భారతీయ రక్షణ కంపెనీలు ఈ అధునాతన క్షిపణులను దేశీయంగా తయారు చేసే అవకాశం లభిస్తుందని రక్షణ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా పెద్ద రక్షణ సంస్థలకే కాకుండా.. డిఫెన్స్ సప్లై చైన్‌లో భాగస్వామ్యులయ్యే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs), ఇతర సాంకేతిక భాగస్వాములకు భారీగా అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
భారత్-శ్రీలంక టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట
వర్షాకాలంలో ఉప్పు గడ్డకడుతోందా? ఈ చిన్న చిట్కాలు తెలుసుకోండి