Share News

మొజ్తబా ఖమేనీ కూడా చనిపోయాడేమో!

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:37 AM

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉంటారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. మయామీలో జరిగిన ఓ సదస్సులో

మొజ్తబా ఖమేనీ కూడా చనిపోయాడేమో!

  • మయామీలో ఓ సదస్సులో ట్రంప్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మార్చి 28: ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉంటారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. మయామీలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మొజ్తబా చనిపోయి ఉంటాడు. లేదా తీవ్రంగా గాయపడి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎక్కడా కనిపించట్లేదు’’ అన్నారు. ఇరాన్‌ నాయకత్వ నిర్మాణం మొత్తాన్ని అమెరికా ధ్వంసం చేసిందని, వారికిప్పుడు నాయకులు ఎవరూ లేరని చెప్పారు. ఇప్పుడు ఇరాన్‌ చర్చల కోసం అమెరికాను అడుక్కుంటోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, విలేకరులు తనను ఏ అంశంపైన అయినా నిర్భయంగా ప్రశ్నించవచ్చని, శృంగార విషయాలు కూడా అడగవచ్చని ట్రంప్‌ ఈ సందర్భంగా అనడం తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:37 AM