Share News

కాంగ్రెస్‌ గ్యారెంటీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:26 AM

కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారెంటీ పథకాలతో ప్రతి కుటుంబానికి నెలకు నాలుగైదువేల రూపాయలు ఆదా...

కాంగ్రెస్‌ గ్యారెంటీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు

  • కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌

బెంగళూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారెంటీ పథకాలతో ప్రతి కుటుంబానికి నెలకు నాలుగైదువేల రూపాయలు ఆదా అవుతోందని సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. తమ గ్యారెంటీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా కాపీ చేస్తున్నారని పేర్కొన్నారు. వయోజనులకు 5వేల డాలర్లు ఇస్తామని ట్రంప్‌ ప్రకటించారని, తమ ఆలోచనలు విశ్వానికే ఆదర్శమని...అదే కాంగ్రెస్‌ పార్టీ విధానమని వెల్లడించారు. బెంగళూరులో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారెంటీల అమలు సాధ్యం కాదని బీజేపీ నేతలు ప్రారంభంలో ఆరోపణలు చేశారని.., మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌లో తమ పథకాలను కాపీకొట్టి తీసుకొచ్చారని ఎద్దేవాచేశారు. కర్ణాటక కాంగ్రె్‌సలో గ్రూపులు లేవని, మాజీ సీఎం సిద్దరామయ్య, పార్టీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌ సహా తామంతా ఒక్కటేనని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:26 AM