డీకేకు తప్పని తిప్పలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రులు..
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:09 AM
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌కు మంత్రుల నుంచి తిప్పలు తప్పటం లేదు. శాఖల కేటాయింపు విషయంలో సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు, జూన్ 9: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌కు మంత్రుల నుంచి తిప్పలు తప్పటం లేదు. శాఖల కేటాయింపు విషయంలో సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామలింగారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రామలింగారెడ్డి ఆకస్మాత్తుగా రాజీనామా చేయటం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధిష్ఠానం కృష్ణ బైరే గౌడకు గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియో కేటాయించింది. అయితే, ఆయన ఇప్పటివరకు ఆ శాఖ బాధ్యతలు తీసుకోలేదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రామలింగారెడ్డి ఫోర్ట్‌ఫోలియో విషయంలో నెలకొన్న సందిగ్ధత కారణంగా బైరే గౌడ ఇంకా పదవి బాధ్యతలు చేపట్టలేదు. రామలింగారెడ్డికి గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియో ఇస్తానని అధిష్ఠానం మాటిచ్చింది. కానీ, ఆ శాఖను బైరే గౌడకు కేటాయించి.. రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖ కేటాయించింది. దీంతో ఆగ్రహానికి గురైన రామలింగారెడ్డి జూన్ 5వ తేదీన పదవికి రాజీనామా చేశారు. ఇక, అప్పటినుంచి గ్రేటర్ బెంగళూరు డెవలప్‌మెంట్ ఫోర్ట్‌ఫోలియో విషయంలో సందిగ్ధత నెలకొంది.
ఆ శాఖను రామలింగారెడ్డికి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఫోర్ట్‌ఫోలియో విషయంలో క్లారిటీ తెచ్చుకోవడం కోసం అధిష్ఠానాన్ని కలవడానికి బైరే గౌడ ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే రిజ్వాన్ కూడా ఢిల్లీ వెళ్లారు. త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రి పదవి ఆశిస్తూ రిజ్వాన్ ఢిల్లీ వెళ్లారు. క్యాబినెట్‌లో 21 ఖాళీలు ఉండటంతో ఔత్సాహికులు తమ అదృష్టం పరీక్షించుకోవడానికి ఢిల్లీ బాటపడుతున్నారు. ఇది వరకే మంత్రి పదవి పొందిన వారు మాత్రం తమ శాఖల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతల అసంతృప్తి కారణంగా డీకే శివకుమార్ ఇబ్బందుల్లో పడిపోయారు.
ఇవి కూడా చదవండి
స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం: మంత్రి వాసంశెట్టి సుభాశ్