ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్లమెంట్ వద్ద ఘన స్వాగతం
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:07 AM
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు తొలిసారి వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్‌కు తోటి బీజేపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు...
జిందాబాద్‌లు కొట్టిన ఎన్డీయే ఎంపీలు
న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు తొలిసారి వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్‌కు తోటి బీజేపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తమ ఎంపీకి సంఘీభావంగా నిలిచారు. సోమవారం ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌కు వస్తున్న సమయంలో బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్ష ఎంపీలు పార్లమెంట్ ముఖద్వారమైన మకరద్వార్ వద్ద ఆయనకు సంప్రదాయ టోపీ ధరింపచేసి అభివాదాలు చేశారు. ఇరువైపులా ఉండి ప్రధాన్‌ను లోపలికి సాదరంగా తోడ్కొని వెళ్లారు. అదే సమయంలో మకరద్వార్ వద్ద కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంఽధీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు ‘చోర్ చోర్.. పేపర్ చోర్’ అంటూ నినాదాలు చేశారు. బిల్కిస్ బానో హంతకులకు, అమ్మాయిలపై అత్యాచారం చేసిన వాళ్లకు పూలమాలలు వేసి స్వాగతం పలికిన సంస్కృతి బీజేపీదని ధ్వజమెత్తారు. కాగా, తాను ఏసీ గదుల్లో కూర్చునే కార్యకర్తను కానని, వీధి పోరాటాలు చేసే యోధుడనని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News