29 ఏళ్ల క్రితం పేపర్‌లీకేజీపై ఉద్యమించిన ప్రధాన్
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:38 AM
ఒకప్పుడు విద్యార్థి నాయకుడిగా, పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున ఉద్యమించిన నేత. కానీ, నేడు అదే మాదిరి.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న...
విద్యార్థులతో కలసి ఒడిశా సెక్రటేరియట్ ముట్టడి
న్యూఢిల్లీ, జూలై 22: ఒకప్పుడు విద్యార్థి నాయకుడిగా, పేపర్ లీకేజీపై పెద్ద ఎత్తున ఉద్యమించిన నేత. కానీ, నేడు అదే మాదిరి.. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై, ఏం చేయాలో పాలుపోక మౌనం దాల్చిన నేత. ఆయనే కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్. 1997లో ఒడిశాలో రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటన చోటుచేసుకుంది. నాడు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ధర్మేంద్ర ప్రదాన్, విద్యార్థులతో కలసి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిపించారు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. 1,500 మంది విద్యార్థులతో కలసి సచివాలయం ముందు కదంతొక్కారు. పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడినా, ఎముకలు విరిగినా, వెనక్కు తగ్గకుండా ఆ ఉద్యమాన్ని కొనసాగించారు. నాటి పోరాటమే ఒడిశాలో ఆయన్ను బలమైన విద్యార్థి నేతగా నిలబెట్టింది. నాడు ఆయన ధర్నాలు చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి