ఎయిరిండియాకు కోటి జరిమానా
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:52 AM
చెల్లుబాటు అయ్యే ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్(ఏఆర్‌సీ)లేకుండా విమాన సర్వీసులు నడిపినందుకు డీజీసీఏ ఎయిర్ ఇండియాపై రూ.కోటి ఫైన్ విధించింది. ఈ లోపాల...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: చెల్లుబాటు అయ్యే ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్(ఏఆర్‌సీ)లేకుండా విమాన సర్వీసులు నడిపినందుకు డీజీసీఏ ఎయిర్ ఇండియాపై రూ.కోటి ఫైన్ విధించింది. ఈ లోపాల కారణంగా ఎయిరిండియా ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసిందని ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ తీవ్రమైన లోపాలకుగానూ బాధ్యులైన ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులను తొలగించాలని ఆదేశించింది. ఎయిరిండియా సంస్థ గతేడాది నవంబరు 24, 25 తేదీల్లో న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ మధ్య ఏఆర్‌సీ లేకుండానే ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని నడిపినట్టు డీజీసీఏ గుర్తించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News