Share News

ఢిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..

ABN , Publish Date - May 27 , 2026 | 07:37 AM

ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో 23 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ హత్య జరిగింది.

ఢిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..
Delhi Crime News

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని ఖజురి ఖాస్ ప్రాంతంలో 23 ఏళ్ల యువకుడిని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఖజూరి ఖాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ హత్య జరిగింది. ఓ యువకుడిపై కాల్పులు జరిగినట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


మృతుడిని రాజా మేవతి అలియాస్ అక్కి అలియాస్ ఆకిబ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై ఖజురి ఖాస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హత్య ఎవరు చేశారనే అంశంపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసేందుకు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలం నుంచి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.


మరోవైపు ఈ నెల 24న కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. రోహిణి జిల్లా బేగంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైన్ నగర్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రాజా (21) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఓ శుభకార్యానికి నిందితుడు తుపాకీతో వచ్చాడు. అది ప్రమాదవశాత్తూ పేలి రాజా కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించామని, అతనికి చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

సిద్దూ.. తప్పుకో!

అక్రమ వలసలకు చెక్‌

Updated Date - May 27 , 2026 | 07:47 AM