Share News

ఐఆర్‌ఎస్‌ అధికారి కుమార్తెపై హత్యాచారం!

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:45 AM

దక్షిణ ఢిల్లీలో నివాసం ఉంటోన్న ఒక సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కుమార్తె(22)పై బుధవారం ఉదయం ఆయన ఇంటిలో పనిచేసినయువకుడే అత్యాచారం జరిపి హత్య చేశాడు...

ఐఆర్‌ఎస్‌ అధికారి కుమార్తెపై హత్యాచారం!

  • పనివాడే నిందితుడు.. అరెస్టు.. ఢిల్లీలో ఘటన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: దక్షిణ ఢిల్లీలో నివాసం ఉంటోన్న ఒక సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కుమార్తె(22)పై బుధవారం ఉదయం ఆయన ఇంటిలో పనిచేసినయువకుడే అత్యాచారం జరిపి హత్య చేశాడు. యూపీఎ్‌ససీ పరీక్షకు సిద్ధం అవుతోన్న ఆమె ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారం చేసి మొబైల్‌ ఫోన్‌ చార్జర్‌ కేబుల్‌ని గొంతుకు బిగించి హత్య చేశాడు. ఉదయంతల్లిదండ్రులు జిమ్‌కు వెళ్లగా ఆమె ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో పనిచేసిన రాహుల్‌ మీనా(19) అనే యువకుడినే ఈ ఘటనలో నిందితుడిగా పోలీసులు గుర్తించి.. అరెస్టు చేశారు. హత్య అనంతరం అతడు ఆ ఇంటిలో దోపిడీకిపాల్పడ్డట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన రాహుల్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో 8 నెలలు పనిచేశాడు. సరుకుల కొనుగోలులో డబ్బు స్వాహా చేసిన కారణంగా నెల క్రితం అతడిని తొలగించారు. ఇంటి యజమానులు ఎప్పుడెప్పుడు బయటకి వెళతారో తెలిసిన అతడు బుధవారం ఉదయం వారు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి బాధితురాలిపై దాడి చేశాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో తలపై స్టిక్‌తో బలంగా కొట్టి గాయపరిచి అత్యాచారం చేశాడు. ఆపై చార్జర్‌ కేబుల్‌తో గొంతు బిగించి హత్య చేశాడు. దీంతో మీనాపై పోలీసులు అత్యాచారం, హత్య, దోపిడీ కేసు నమోదు చేశారు. మీనా ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంటిలోకి ప్రవేశిస్తున్న, అలాగే బయటకు వెళుతోన్న సమయంలోని సీసీ ఫుటేజీని కూడా సేకరించారు. అత్యంత భద్రత కలిగిన ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంటిలో ప్రతి ఫ్లోర్‌కి లాక్‌లు ఉన్నట్లు సమాచారం. బాధితురాలు ఉన్న గదిలోకి వెళ్లేందుకు నాలుగు లాక్‌లను తెరవాల్సి ఉంటుంది. వాటి పాస్‌కోడ్‌లు, స్పేర్‌ తాళాలు ఎక్కడ ఉంటాయో ముందే తెలిసిన రాహుల్‌ సులువుగా లోపలికి వెళ్లాడు. కాగా నిందితుడు ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై భారీగా అప్పులు చేసినట్లు పోలీసుల గుర్తించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 05:45 AM