సీజేపీ ఆందోళనలు.. వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేసే అవకాశం!
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:34 PM
సీజేపీ నిరసనల హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇంటర్నెట్ డెస్క్: సీజేపీ నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. నిరసనల సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు, ఫొటోలు, ఇతర డిజిటల్ ఆధారాల ఆధారంగా హింసలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.
కాగా, నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యావ్యవస్థలో అవకతవకలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు-పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో కొందరు నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ల(ACP)తో పాటు ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read:
సీజేపీ ఆందోళనలు.. వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేసే అవకాశం!
క్యూనెట్ పిరమిడ్ మోసంపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..