యూత్ కాంగ్రెస్ నిరసన వెనుక పెద్ద కుట్ర
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:22 AM
ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన వెనుక పెద్ద కుట్ర ఉందని.. నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చేసిన హింసాత్మక జెన్ జెడ్ ఉద్యమం నుంచి వారు ప్రేరణ...
పాటియాలా కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన వెనుక పెద్ద కుట్ర ఉందని.. నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చేసిన హింసాత్మక జెన్ జెడ్ ఉద్యమం నుంచి వారు ప్రేరణ పొందారని పాటియాలా హౌస్ కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ‘నిరసన వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఆందోళనకారులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధాని మోదీ అభ్యంతరకర చిత్రాలున్న టీషర్టులను ప్రదర్శించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరికొందరు పారిపోయారు. అందర్నీ ముఖాముఖి, డిజిటల్ ఆధారాలతో ప్రశ్నించాల్సి ఉంది. వీరికి నిధులు ఎక్కడి నుంచి అందాయన్నది గుర్తించాల్సి ఉంది. నిందితుల ఫోన్ల నుంచి డేటా సేకరించి విశ్లేషిస్తున్నాం. ఘర్షణలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. లోతైన దర్యాప్తునకు నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించండి’ అని పోలీసులు కోరారు. 5 రోజుల పాటు నిందితుల పోలీసు కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. కాగా, యూత్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త, జడ్చర్లకు చెందిన పి.నరసింహ యాదవ్ నేతృత్వంలో దాదాపు 10 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏఐ సదస్సులో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చొక్కాలు విప్పి అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News