బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. అందరూ చూస్తుండగానే కాలి బూడిదైన 9 మంది..
ABN , Publish Date - Mar 18 , 2026 | 08:51 PM
చనిపోవడానికి ముందు ముగ్గురు వ్యక్తులు సాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ముగ్గురు వ్యక్తులు సాయం కోసం బాల్కనీలోకి వచ్చి నిల్చుని ఉన్నారు. చావు భయంతో గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు.
న్యూఢిల్లీ, మార్చి18: దేశ రాజధాని ఢిల్లీ, పాలమ్ ఏరియాలోని ఓ బిల్డింగ్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది కూడా పోలీసులు, ఫైర్ సిబ్బంది కళ్ల ముందే సహాయం కోసం అరుస్తూ ప్రాణాలు కోల్పోయారు. చనిపోవడానికి ముందు ముగ్గురు వ్యక్తులు సాయం కోసం కేకలు వేస్తున్న దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ముగ్గురు వ్యక్తులు సాయం కోసం బాల్కనీలోకి వచ్చి నిల్చుని ఉన్నారు. చావు భయంతో గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు.
ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి ఎంతగానో ప్రయత్నించసాగారు. ఏకధాటిగా నీటిని మంటలు వస్తున్న వైపు స్ప్రే చేస్తూనే ఉన్నారు. అయినా లాభం లేకుండా పోయింది. ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వారిని నిచ్చెన ద్వారా కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, ఆ నిచ్చెన పొడవు తక్కువగా ఉండటంతో కింద ప్లోర్ దగ్గరే ఆగిపోయింది. హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా సాంకేతిక లోపం కారణంగా పని చేయలేదు. దీంతో బిల్డింగ్‌లోని 9 మంది మంటల్లో కాలి బూడిద అయిపోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
ఇక, ఇదే సంఘటనలో ఓ వ్యక్తి తన 6 నెలల కూతుర్ని బిల్డింగ్ పైనుంచి కిందకు పడేశాడు. తర్వాత అతడు కూడా కిందకు దూకాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనపై పీఎమ్‌ఓ ఆఫీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? దీని ప్రత్యేకత ఏంటి?
హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..