ఢిల్లీ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. బిల్డింగ్ మీద నుంచి దూకిన మహిళ..
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:46 PM
ఢిల్లీ, మల్వియా నగర్‌లోని ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోగా.. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీ, మల్వియా నగర్‌లోని ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’లో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోగా.. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 40 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది మధ్య ఆసియా, ఆఫ్రికాకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
పైనుంచి దూకేసిన మహిళ
ఐదంతస్తుల భవనంలోని బేస్‌మెంట్‌లో ఉన్న రెస్టారెంట్‌లో ప్రారంభమైన మంటలు అతి వేగంగా పై అంతస్తులకు పాకాయి. పై అంతస్తులోని హోటల్‌లో బస చేసిన వారు మంటల్లో చిక్కుకున్నారు. కొంతమంది మంటల్లో కాలి బూడిదయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం బిల్డింగ్‌పైనుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మహిళ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకిన దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు
పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి