ముగిసిన కేసు వివరాలు ఆన్‌లైన్‌లో అక్కర్లేదు
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:57 AM
వ్యక్తిగత కేసులకు సంబంధించిన కోర్టు వ్యవహారాల రికార్డులను గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో ఎల్లకాలం ఉంచాల్సిన పనిలేదంటూ ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పు...
న్యూఢిల్లీ, జూన్ 1: వ్యక్తిగత కేసులకు సంబంధించిన కోర్టు వ్యవహారాల రికార్డులను గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో ఎల్లకాలం ఉంచాల్సిన పనిలేదంటూ ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ప్రతి ఒక్కరికీ ‘విస్మరణకు గురయ్యే హక్కు’ (రైట్ టు బీ ఫర్‌గాటెన్) ఉంటుందని తెలిపింది. అది వ్యక్తిగత గోప్యత హక్కులో భాగమని స్పష్టం చేసింది. అందువల్ల పేరు ఆధారంగా సెర్చ్ చేస్తే కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు వెల్లడి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. పూర్తిగా వ్యక్తిగతమైనవి, నిర్దోషులుగా బయటపడిన కేసులు అందరికీ ఎల్లప్పుడూ తెలియాల్సిన అవసరం లేదని పేర్కొంది. అందువల్ల వాటిని తొలగించేందుకు ‘డీ-ఇండెక్స్’ చేయాలని ఆదేశించింది. అయితే ఇది మహిళలు, పిల్లలపై దాడి జరిగిన సంఘటనలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సంబంధించిన కేసులకు వర్తించదని స్పష్టం చేసింది. వ్యక్తుల పేరు మీద కోర్టు రికార్డులను నిరంతరం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచితే అది వారి వ్యక్తిగత గోప్యత, ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం