ఘోర ప్రమాదం.. ట్రక్ సిలిండర్ పేలి ముగ్గురి మృతి..
ABN , Publish Date - Aug 19 , 2026 | 09:40 PM
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ సీఎన్‌జీ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్ సీఎన్‌జీ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. సీఎన్‌జీతో నడిచే ఓ ట్రక్ బుధవారం సిలిండర్‌లో గ్యాస్ నింపించుకోవడానికి తిక్రి కలాన్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న సీఎన్‌జీ పంప్ దగ్గరకు వచ్చింది.
సిలిండర్‌లో గ్యాస్ నింపుతున్న సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలటంతో సీఎన్‌జీ పంపులో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన ముగ్గురిని మహేష్, బ్రహ్మ్‌జీత్, సన్నీగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
బాబోయ్ పులి.. గుర్రాన్ని ఎలా ఈడ్చుకెళ్తోందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..
ఏపీ ప్రయోజనాలపై కేంద్రంతో కీలక చర్చలు.. మహాబలిపురానికి సీఎం చంద్రబాబు