Share News

ఏఐ సృష్టికర్తగా భారత్‌ రూపొందాలి

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:51 AM

భారతదేశం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగదారుగా మిగిలిపోకుండా, దాని సృష్టికర్తగా మారాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆకాంక్షించారు. వేలూరులోని ‘వీఐటీ...

ఏఐ సృష్టికర్తగా భారత్‌ రూపొందాలి

  • వీఐటీ వేలూరు స్నాతకోత్సవంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

చెన్నై, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): భారతదేశం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగదారుగా మిగిలిపోకుండా, దాని సృష్టికర్తగా మారాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆకాంక్షించారు. వేలూరులోని ‘వీఐటీ విశ్వవిద్యాలయం’ 41వ స్నాతకోత్సవానికి శనివారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం, పట్టభద్రులు కలసి పనిచేస్తే.. సమాజంలోని అనేక తీవ్ర సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. వైఫల్యానికి భయపడవద్దని, ఒత్తిడికి గురికావద్దని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీఐటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్‌ జి.విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. టీసీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బాబు ఉన్నికృష్ణన్‌ ప్రసంగించగా, వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాథన్‌, శేఖర్‌ విశ్వనాథన్‌, జీవీ సెల్వం, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంధ్యా పెంటారెడ్డి, సహాయ ఉపాధ్యక్షురాలు కాదంబరి ఎస్‌.విశ్వనాథన్‌, రమణి బాలసుందరం, వైస్‌ చాన్స్‌లర్‌ వీఎస్‌ కాంచన భాస్కరన్‌, ప్రొ వైస్‌ చాన్స్‌లర్‌ పార్థసారఽథి మల్లిక్‌, రిజిస్ట్రార్‌ టి.జయభారతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వీఐటీలో ఏర్పాటైన అంటువ్యాధుల అధునాతన పరిశోధనా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 05:51 AM